జనతాగ్యారేజ్….కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపించింది…..మినీ రివ్యూ

32
5884

ntr mvie trailtnsjhtbnsmtbజనవరి 13 నాన్నకుప్రేమతో తరువాత దాదాపు 8 నెలల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నూతన సినిమా జనతాగ్యారేజ్ ప్రేక్షకులముందుకు వచ్చేసింది. తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలిచిన జనతాగ్యారేజ్ అభిమానులకు ఫుల్లుగా నచ్చగా కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం పదండీ….

సినిమా స్టొరీ ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. ప్రకృతిని ప్రేమించే ఓ స్టూడెంట్ ముంబైలో ఎన్విరాన్మెంట్ కోర్స్ చేస్తుంటాడు. మరోపక్క మనుషులను ప్రేమించే మోహన్ లాల్ హైదరాబాదు లో 1980 నుండి జనతాగ్యారేజ్ అనే గ్యారేజ్ ను స్థాపించి ప్రజల కష్టాలను తీర్చుతుంటాడు.

ఈ క్రమంలో ఓ భారీ శక్తిగా ఎదిగిన జనతాగ్యారేజ్ ని తొక్కడానికి ప్రయత్నాలు జరగగా అనుకోకుండా హైదరాబాదు వచ్చిన ఎన్టీఆర్-మోహన్ లాల్ కి పరిచయం అవ్వడం తరువాత మోహన్ లాల్ ఎన్టీఆర్ ని జనతాగ్యారేజ్ కి ఆహ్వానించడం జరుగుతుంది.

ఎన్టీఆర్ రాకతో జనతాగ్యారేజ్ లో వచ్చిన మార్పులు ఏమిటి….తరువాత ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అభిమానులను మొదటి సీన్ నుండి ఎన్టీఆర్ హీరోయిజం కొత్తగా ఫ్రెష్ గా అనిపించింది…దాంతో వాళ్ళు చాలావరకు సాటిస్ ఫై అవ్వగా యాక్షన్ సీన్స్ మాత్రం పిచ్చపిచ్చగా నచ్చేశాయి వాళ్లకి.

ఇక కామన్ ఆడియన్స్ స్టొరీలైన్ బాగా నచ్చిందని చెప్పొచ్చు. కథ చిన్నదే అయినా కొరటాల శివ టేకింగ్ కామన్ ఆడియన్స్ ని సీటులో చివరి వరకు కూర్తోబెట్టింది అని చెప్పొచ్చు. ఇక ఎన్టీఆర్-మోహన్ లాల్-నిత్యమీనన్ ల ఫ్రెష్ కాంబినేషన్ వాళ్లకి సరికొత్త రిలీఫ్ ఇచ్చింది.

పాటల్లో ఎన్టీఆర్ ఎక్కడా తన మార్క్ ని మిస్ అవ్వకుండా చూసుకున్నాడు, పక్కా లోకల్ సాంగ్ లో రచ్చ చేశాడు. ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అభిమానులకే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా రోమాలు నిక్కబోర్చేలా చేశాయని చెప్పొచ్చు.

ఇక మైనస్ ల గురించి మాట్లాడుకుంటే అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ కి ఇంటర్వల్ వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. లవ్ యాంగిల్ అనుకున్న విధంగా ఫలించలేదు….కామెడీ అస్సలు లేదు….సినిమా ఫస్టాఫ్ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్….సినిమాలో స్లో మూమెంట్స్ మరీ ఎక్కువ అయ్యాయి…..ఎన్టీఆర్ ఎక్కువ శాతం సీన్లు సైలంట్ గా ఉండేలా డిసైన్ చేయడం అస్సలు బాలేదు……సినిమా లెంత్ ఎక్కువైంది….అంతే ఇవే సినిమాకి మైనస్ పాయింట్స్.

ఇవి చెప్పాలి కాబట్టి చెబుతున్నాం కానీ సినిమాలో ఇవి కాకుండా బోర్ అవ్వడానికి ఎలాంటి అవకాశం లేదు. తిరు కెమరావర్క్ ప్రేక్షకులను కొత్తగా ఫీల్ అయ్యేలా చేసింది. దేవి పాటలతో ఎలా ఆకట్టుకున్నాడో బ్యాగ్రౌండ్ స్కోర్ తో అంతకుమించి ఆకట్టుకున్నాడు.

సినిమాకి మేజర్ హైలెట్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక యాక్షన్ సీన్స్ చాలా బాగా షూట్ చేశారు.

మొత్తంమీద జనతాగ్యారేజ్ ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పొచ్చు. టెంపర్-నాన్నకుప్రేమతో లో మిస్ అయిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా ఉంటుంది అనేది ఈ వీకెండ్ వరకు ఆగితే తెలుస్తుంది.

మొత్తంమీద జనతాగ్యారేజ్ కామన్ ఆడియన్స్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి ఎలాగు ట్రీట్ కాబట్టి….ఈ సారి ఎన్టీఆర్ గట్టిగా కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు….

మీరు సినిమా చూస్తె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…..

32 COMMENTS

 1. movie is block buster,anna acting & mohalal sir acting is too good,superb screenplay,but climax uhinchina vidanga ledu,rajeev kanakala scene awesome,some scenes give goosebumbs

 2. సిని చరిత్రలో కలెక్షన్స్ గురి౦చి మాట్లడుతున్నారు నటన గురి౦చి సినిమా గురి౦చి మాట్లడట౦ లేదు ఇప్పుడున్న హిరోలలో ఏ పాత్రనైన చేయ్యగల నటుడు ‘యన్ టి ఆర్,
  ఫస్టాప్ పర్వాలేదు
  సెక౦డ్ ఆఫ్ రికార్డ్స్ తిరగరాయగలడు
  బహుబలి బాగ లేక పోయిన కలెక్షన్స్ రావట౦ వల్ల హిట్ అని చెప్పారు
  సరైనోడు కుడా అ౦తే ప్లాప్ టాక్ వచ్చిన కలేక్షన్స్ వచ్చాయి అ౦దుకని హిట్ అన్నారు
  ఈ జనతాగ్యారెజ్ సినిమా 2016 ఆల్ టైమ్ ఇ౦డ్రష్టి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్

LEAVE A REPLY