జనతాగ్యారేజ్ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ అండ్ T2B రేటింగ్

27
2787

ntr movie resisntvbsmtయంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ జనతాగ్యారేజ్ సాంగ్స్ అండ్ ట్రైలర్ లాంచ్ అత్యంత భారీగా జరిగింది, ఆడియోలో అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది సినిమా ట్రైలర్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ని 6 నెలలో టోటల్ నాన్నకుప్రేమతో నుండి మేకోవర్ అయ్యేలా చేశాడు కొరటాల శివ.

ఇక ట్రైలర్ రివ్యూకి వచ్చేస్తే ట్రైలర్ ఫస్టాఫ్ నేచర్ ని ప్రేమించే స్టూడెంట్ గా ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించనంత కొత్తగా కనిపించాడు. ఇక మోహన్ లాల్ ఎన్టీఆర్ కి మావయ్య అంటూ వచ్చిన వార్తలు రూమర్స్ అని ట్రైలర్ లో తెలిసిపోయింది.

కానీ సినిమాలో మోహన్ లాల్ కొడుకు ఉంనిముకుందన్ విలన్ అవ్వబోతున్నది మాత్రం కన్ఫాం అని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ మొత్తం కాలేజ్ బ్యాగ్రాప్ లో సమంత-నిత్యామీనన్-ఎన్టీఆర్ ల ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ తో పాటు మోహన్ లాల్ క్యారెక్టర్ ఎస్టాబ్లేష్ చేయడానికి వాడుకున్నారు.

ఇక సెకెండాఫ్ లో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లోకి ఎంటర్ అయ్యాకా జరిగిన మార్పులు ఏంటి ఆ మార్పులు ఎంతవరకు దారితీసాయి. తండ్రి స్థానంలో తాను నిలవాలి అనుకున్న ఉంనిముకుందన్ ని ఎన్టీఆర్ ఎలా అడ్డుకున్నాడు అన్నది సినిమా కథ.

స్టొరీ కొత్తది కాకున్నా కొరటాల శివ మార్క్ ట్రీట్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు కొరటాల తీసిన మిర్చి కానీ శ్రీమంతుడు కానీ టీసర్లు క్లిక్ అయినంత ట్రైలర్ లు కాలేదు, ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి అని కామన్ ఆడియన్స్ అంటున్నారు.

కానీ కొరటాల ట్రైలర్ లో చెప్పింది సినిమా కథ కాబట్టి కేవలం అందరినీ ఆకట్టుకోవడానికి నాలుగు పంచ్ డైలాగులు-రెండు ఫైట్స్ పెట్టి అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లకుండా స్టొరీ ఎలా ఉండబోతుందో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో ట్రైలర్ కొద్దిగా యావరేజ్ గా అనిపించింది అంటున్నారు కామన్ ఆడియన్స్.

మొత్తంమీద జనతాగ్యారేజ్ ట్రైలర్ విశ్లేషకులతో పాటు ట్రేడ్ పండితులను కూడా ఆకట్టుకుంది. ఎక్స్ ట్రా ఆర్డినరీ అని చెప్పలేము కానీ సంథింగ్-సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.

జనతాగ్యారేజ్ ట్రైలర్ కి T2B ఇస్తున్న రేటింగ్ 3.25/5

మీరు ఎంత రేటింగ్ ఇస్తారో,……మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

27 COMMENTS

LEAVE A REPLY