జనతాగ్యారేజ్ 400-సర్దార్ 450, కానీ ఖైదీనంబర్ 150….520( క్రేజ్ కా బాప్ )

0
2090

మెగాస్టార్ రియల్ స్టామినా ఏంటో చూపించబోతున్న సినిమా ఖైదీనంబర్150, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఓ సినిమాకు ఈ రేంజ్ హైప్ రావడం ఒక్క ఖైదీనంబర్150కే చెల్లింది అంటున్నారు ట్రేడ్ పండితులు.

కాగా తెలుగు సినిమాలకు అతి ముఖ్యమైన మార్కెట్ ఏరియా అయిన నైజాంలో ఈ మధ్య వచ్చిన బిగ్ మూవీస్ ని కూడా దాటేసి ఖైదీనంబర్150 నయా రికార్డు సృష్టిస్తుంది…అక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ సుమారు 450 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 400 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రచ్చ చేయగా ఇప్పుడు ఖైదీనంబర్150 ఏకంగా 520 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. టికెట్ రేటు పెంపు భారీ రిలీజ్ ఏ లెక్కన చూసిన తొలిరోజు ఆల్ టైం హ్యూమ౦గస్ కలెక్షన్స్ రావడం మాత్రం పక్కా అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY