ఖైదీనంబర్150 ని పక్కకు పెట్టి ఎన్టీఆర్ ని వినాయక్ ఎందుకు కలిసాడో తెలిసిపోయింది

0
3560

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అనుకోకుండా ఎన్టీఆర్ కోసం కాకినాడలో ప్రత్యక్షం అయ్యాడు వివివినాయక్. అసలు సడెన్ గా మెగా క్యాంప్ నుండి ఎన్టీఆర్ దగ్గరకు వినాయక్ రావడానికి రీజన్ ఏంటని టోటల్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది.

కాగా ఇది ఎదో సినిమా కోసమో స్పెషల్ మీటింగ్ కోసమో కాదట…ఎన్టీఆర్ ని జనతాగ్యారేజ్ రిలీజ్ తర్వాత దాదాపు 4 నెలలుగా వినాయక్ దూరంగానే ఉంటూ వచ్చాడట…పనిమీద రాజమండ్రి వెళ్ళిన వినాయక్ అక్కడ సడెన్ గా ఎన్టీఆర్ వస్తున్న విషయం తెలుసుకున్నాడట.

దాంతో వెంటనే అక్కడ నుండి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి కలిసి కొద్ది సేపు ముచ్చటించి కుశలసమాచారాలు తెలుసుకుని రాబోయే ప్రాజెక్ట్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుండి తిరిగి వెళ్లాడట..ఎన్టీఆర్ కూడా ఫ్యూచర్ లో మనం తిరిగి కచ్చితంగా సినిమా చేయాలి వినయ్ అన్నా అంటూ పంపించాడని ప్రస్తుతం ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY