ఖైదీనంబర్150 కర్ణాటక రైట్స్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే

0
1487

మెగాస్టార్ మైటీ 150 వ మూవీ ఖైదీనంబర్150 ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క టీసర్, సాంగ్స్ తో ఖైదీనంబర్150 సోషల్ మీడియాలో రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు.

కాగా సినిమా కర్ణాటక రైట్స్ ఇప్పుడు ఆల్ టైం మమ్మోత్ రేటుకి అమ్ముడు పోయినట్లు ఫిల్మ్ నగర్ లో సమాచారం అందుతుంది. బాహుబలి 12 కోట్లని కూడా మించి ఏకంగా 13.50 కోట్ల అవుట్ రేటుకి ఖైదీనంబర్150 రైట్స్ అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు.

9 ఏళ్ల తర్వాత వెండితెరపై కంబ్యాక్ చేయబోతున్న మెగాస్టార్ తన స్టార్ వాల్యూకి తగ్గ విధంగా రికార్డుల దుమ్ము దులిపెస్తున్నాడు. డీమానిటైజేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఈ బిజినెస్ ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతుందో సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు అలాగే అప్పటి వరకు పరిస్థితులు మరింత మారే అవకాశం ఉండటం ఖైదీనంబర్150 కలిసివచ్చే అంశమే అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY