అఫీషియల్::- ఖైదీనంబర్150 “సెన్సార్” టాక్

0
1081

మెగాస్టార్ మైటీ 150 ఖైదీనంబర్150 సినిమా కోసం టోటల్ మెగా ఫ్యాన్స్ తో పాటు అశేష ప్రేక్షకులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత వెండితెరపై మెగాస్టార్ మెరుపులు చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు.

కాగా రిలీజ్ కి 15 రోజుల ముందే సెన్సార్ పనులను జరుపుకున్న ఖైదీనంబర్150 చూసిన సెన్సార్ వారు ప్రతీ పెద్ద సినిమాకి చెప్పినట్లే అదిరిపోయింది అని చెబుతున్నారు కానీ సినిమా అసలు టాక్ ఏంటనేది మాత్రం కొందరు మాత్రమే చెబుతున్నారు..వారి మాటల ప్రకారం……

ఒరిజినల్ వర్షన్ కత్తిలో ఉన్న మెయిన్ ప్లాట్ ని అలాగే తీసుకుని సెకెండ్ ఆఫ్ మొత్తం యాసిటీస్ గా దించేశారని చెబుతున్నారు. కానీ ఫస్టాఫ్ మాత్రం మార్చేసి ఒరిజినల్ లాగా సీరియస్ గా కాకుండా ఎంటర్ టైన్ మెంట్ గా మార్చారట. కాగా కీలకమైన ఇంటర్వెల్ ఫైట్ సినిమా అసలు రేంజ్ ఎలా ఉండబోతుందో చెప్పేలా ఉండి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెంచుతుందట.

అక్కడ నుండి సినిమా మెగాస్టార్ మైటీ హీరోయిజంతో దుమ్ము రేపుతుందని…మధ్యలో వచ్చే రత్తాలు ఐటెం సాంగ్ ఇంకో లెవల్ కి తీసుకెలుతుందని అంటున్నారు. ఇక ముగ్గురు మెగా హీరోల క్యామియో ఓ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. ఎలాగు వినాయక్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పేది ఏమి లేదు కాబట్టి కచ్చితంగా హిట్ సినిమా అంటున్నారు వాళ్ళు.

LEAVE A REPLY