ఖైదీనంబర్150….మినీ రివ్యూ….కామన్ ఆడియన్స్ టాక్

0
1348

మెగాస్టార్ 2007 శంకర్ దాదా జిందాబాద్ తర్వాత దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఖైదీనంబర్150…..91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే షాక్ అయినవాళ్ళు ఇప్పుడు సినిమా ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఫ్యాన్స్ కి భీభత్సంగా నచ్చేసిన ఖైదీనంబర్150 కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుందో తెలుసుకుందాం పదండి…..ఇక్కడ ఒరిజినల్ కత్తిని చూసినవాళ్లకి ఒకేఒక మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు ఇంటర్వెల్ లో విజయ్ చెప్పే వెయిటింగ్ కి ధీటుగా చిరు చెప్పలేకపోయాడు అని.

ఇది తప్పితే చూసినవాళ్ళు చూడనివాళ్ళు ఖైదీనంబర్150కి జై కొట్టకుండా ఉండలేరు….అక్కడక్కడా వెయిట్ పెరిగి ఉన్నట్లు కనిపించడం కొద్దిగా ఇబ్బంది అనిపించినా ఓవరాల్ గా మెగాస్టార్ మెగా మేకోవర్ అద్బుతంగా సెట్ అయింది అని చెప్పొచ్చు.

సీన్ టు సీన్ రివీల్ చేస్తే ధ్రిల్ పోతుంది కాబట్టి చెప్పడం లేదు కానీ మెగాస్టార్ ప్రతీ సీన్ లోను తనదైన ముద్ర వేశాడు. ఇక కాజల్ కూడా మెగాస్టార్ కి తగ్గ జోడి అనిపించుకుంది అంటున్నారు.

స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ సూపర్ గా రచ్చ చేశాడు అంటున్నారు….ఇక దేవి శ్రీ సాంగ్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కత్తి రేంజ్ లో ఇవ్వలేకపోయాడు అంటున్నారు.

వినాయక్ రెండు వరుస ఫ్లాఫుల తర్వాత స్టార్ హీరోతో చేసిన మొదటి సినిమా ఇదే. స్టార్ హీరోలతో తన రేంజ్ ఎలా ఉంటుందో ఇందులో మరోసారి రుజువు చేశాడు….ఇన్ని ప్లస్సుల మధ్య క్లైమాక్స్ కొత్తగా అలోచించి చేయకపోవడం ఒక్కటే మైనస్ అంటున్నారు.

మొత్తంమీద కత్తి రేంజ్ ను పెంచే రీమేక్ ఇది అంటున్న కామన్ ఆడియన్స్ ఖైదీనంబర్150కి పాజిటివ్ టాక్ ఇచ్చేశారు అని చెప్పొచ్చు. ఇక వీకెండ్ వరకు కలెక్షన్స్ సునామీ కూడా ఖాయమే అంటున్నారు ట్రేడ్ పండితులు…వచ్చే సినిమాల టాక్ ని బట్టి వచ్చే వారం వర్కింగ్ డేస్ కలెక్షన్స్ ని బట్టి ఖైదీనంబర్150 ఏ రేంజ్ విజయమో అంచనా వేయొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY