భీమవరం 250-ఒంగోలు 300-వైజాగ్..ఈస్ట్…వెస్ట్-200…ఏంటి సామీ ఈ విద్వంసం

0
6212

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ “ఖైదీనంబర్150” రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అంచనాలు అమాంతం పెంచుకుంటూ దూసుకుపోతుంది. టాలీవుడ్ హిస్టరీలోనే ఏ సినిమాకు లేని విధంగా “ఖైదీనంబర్150” కి టికెట్ రేట్లు పెంచాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు అఫీషియల్ గా బాహుబలి, జనతాగ్యారేజ్, సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బ్రహ్మోత్సవం సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లని 100 కి పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చారు…కానీ క్రేజ్ దృశ్యా బిజినెస్ దృశ్యా “ఖైదీనంబర్150” కి ఈ రేట్లలో ఓ రేంజ్ పెరుగుదల ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు…

ఇప్పటివరకు అఫీషియల్ గా ఒంగోలులో టికెట్ రేటు 300, భీమవరంలో 250 రేట్లు ఫిక్స్ అవ్వగా వైజాగ్, ఈస్ట్, వేస్ట్ ఏరియాల్లో 200 రేటు ఫిక్స్ చేశారు… ఈ రేట్లు అన్ని ఏరియాలకు పాకడం ఖాయం అంటున్నారు. ఈ రేట్లు ఎక్కువగా మల్టీప్లెక్స్ లకే కాదు కొన్ని సింగిల్ స్క్రీన్స్ కి కూడా వర్తిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే తొలిరోజు హిస్టారికల్ వసూళ్లు రావడం మాత్రం పక్కా..

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY