అఫీషియల్:-ఖైదీనంబర్150 ట్రైలర్ రివ్యూ-రేటింగ్….కామన్ ఆడియన్స్ టాక్

4
1909

మెగాస్టార్ చిరంజీవి మైటీ కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 రిలీజ్ కి ముందు ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు…ఫస్ట్ నుండి ఓ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టీసర్, సాంగ్ లిరిక్ వీడియోలతో క్రేజ్ ని మరింత పెంచుకుంది.

కానీ అసలు సిసలు ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఒకింత నిరుత్సాహపరిచింది అని చెప్పొచ్చు…మెగాస్టార్ ఎంత బాగున్నా…డాన్సులు-ఫైట్లు-డైలాగులు ఎంత పవర్ ఫుల్ గా చెప్పినా టోటల్ ట్రైలర్ అవుట్ పుట్ మొత్తంమీద యావరేజ్ గా ఉందని తేల్చేశారు కామన్ ఆడియన్స్…

మేము కూడా ఒరిజినల్ కత్తిని చూసి ఉండటం వల్ల కావొచ్చు ట్రైలర్ పై ఆ ఇంపాక్ట్ పడింది…ప్రతీ షాట్ కి ఒరిజినల్ లింక్ చేయొద్దు అనుకుంటూనే చేసుకోవడం…అక్కడ గూస్ బంప్స్ తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇక్కడ మిస్ అయిన ఫీల్ వచ్చింది.

ఇద మా ఫీలింగ్ మాత్రమే కాదు…కత్తి చూడని వాళ్ళలో కొందరు ట్రైలర్ కట్ తొందరగా కట్ చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివర్లో మెగాస్టార్ చెప్పే వెయిటింగ్ డైలాగ్ చాలా ఆర్టిఫీషియల్ గా ఉందని అంటున్నారు వారు.

ఈ చిన్న మైనస్ లు పక్కకు పెడితే మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత కంబ్యాక్ మూవీ కాబట్టి ఎలా ఉన్నా మెగాస్టార్ ని దర్శనం చేసుకోవడానికే అందరూ వెళతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు….ఇక మేము ట్రైలర్ కి ఇచ్చే రేటింగ్—–3/5….ఒకటి మెగాస్టార్ కి, రెండు మెగాస్టార్ కి…మూడు కూడా మెగాస్టార్ కే…..ఇక మీరు ట్రైలర్ చూసి ఎలా ఉందో ఎంత రేటింగ్ ఇస్తారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

4 COMMENTS

LEAVE A REPLY