మెగాఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్…థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం

0
1219

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 పై స్కై హై అంచనాలు ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీని ఊపెస్తున్నాయి…ఏ సెంటర్ ని కూడా వదలని ఈ మ్యానియా తొలిరోజు ఖైదీనంబర్150 కి ఆల్ టైం రికార్డు లెవల్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేలా ఉందని ట్రేడ్ పండితులే షాక్ అవుతున్నారు.

కాగా సినిమాలో టోటల్ మెగా హీరోలు కనిపిస్తారు అనుకున్న ఫ్యాన్స్ పవన్ ఇందులో కనిపించడం లేదు అన్న వార్తా విని కొద్దిగా నిరుత్సాహపడ్డా ఇప్పుడు వాళ్ళని సంతోషపెట్టె ఓ వార్తా ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే పవర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీసర్ సంక్రాంతి కానుకగా 14 న రిలీజ్ కానుంది..కాగా ఆ రోజు నుండి టీసర్ ని ఖైదీనంబర్150 ఆడుతున్న అన్ని థియేటర్స్ లో ప్రదర్శిస్తారట. దాంతో సినిమా మధ్యలో వచ్చే ఈ టీసర్ తో టోటల్ మెగా ఫ్యామిలీ హీరోలను ఒక్కసారి చూసిన ఆనందాన్ని అభిమానులు పొందటం ఖాయం అంటున్నారు..

LEAVE A REPLY