మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ “ధృవ” రివ్యూ “****/5”

0
2198

అదేంటి సినిమా రేపు రిలీజ్ అవుతుంటే ఇవాలే రివ్యూ పెడుతున్నారేంటి అనుకుంటున్నారా…ఈ రివ్యూ అండ్ రేటింగ్ మేము ఇచ్చింది కాదండీ…ఏ ఇండియన్ సినిమా అయినా అందరికి కన్నా ముందు దుబాయి ఫిల్మ్ బోర్డ్ లో ప్రీమియర్ అవుతుంది.

ఆ బోర్డ్ లో మెంబర్ అయిన “ఉమైర్ సందు” వెంటనే రివ్యూ రాసి ఆడియన్స్ కి ముందే సినిమాపై ఆసక్తికలిగేలా చేస్తుంది..ఈమే ఇచ్చిన రివ్యూలు అన్నీ ఇప్పటివరకు వర్కౌట్ అయినవి తెలుగులో జనతాగ్యారేజ్…మరో ఒకటి రెండు సినిమాలకు తప్ప మిగిలిన సినిమాలకు పెద్దగా కలిసి రాలేదు.

ఈమె లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ చూసి 5 స్టార్స్ 4 స్టార్స్ ఇచ్చేసింది…సినిమా సూపర్ గా ఉందని ఒరిజినల్ వర్షన్ ని మించి ఈ రీమేక్ ఉందని రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలిస్ రోల్ లో అదరగొట్టాడని, సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉందని మెచ్చుకుంది.

అంతే కాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ టాప్ నాట్చ్ అని ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో ది బెస్ట్ మూవీ అని మెచ్చుకుంది…ఈమె మాటలతో ఏకీభవి౦చినా వించకున్నా తమిళ్ ఒరిజినల్ ని చూసినవాళ్ళు మాత్రం రీమేక్ కూడా ఆ రేంజ్ లో ఉంటే చాలు రికార్డులు తిరగరాస్తుంది అంటున్నారు. అసలు కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో రేపు మినీ రివ్యూలో చెబుతాం.

LEAVE A REPLY