సర్దార్ గబ్బర్ సింగ్ “కామన్ ఆడియన్ టాక్ ఏంటి”?? మినీ రివ్యూ

1
5635

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది తరువాత మూడేళ్లకి ఇవాళ థియేటర్లో అడుగుపెట్టాడు, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఈ మధ్యకాలంలో మెగా హీరోల సినిమాలకు లేనంత రికార్డు స్థాయిలో ఉన్నాయి.

కాగా ఇక్కడ సినిమా టాక్ ని కూడా సంభందం లేకున్నా బాగున్నా బాగా లేకపోయినా అభిమానులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేయాలని ముందే డిసైడ్ అయ్యి ఉన్నారు. సినిమా కూడా అభిమానులను అంచనాలను ఏమాత్రం ఒమ్ము చేయకుండా ఉందని చెప్పొచ్చు కానీ ఓ కామన్ ఆడియన్ సినిమా చూసి ఏమనుకుంటాడో చూద్దాం పదండి.

sardhar mini reviewసింపుల్ కథ “ఒక ఊరు-ఆ ఊరిని కాలికింద పెట్టుకోవాలి అనుకునే విలన్-తండ్రిలా అందరికీ దానదర్మాలు చేస్తూ నలుగురిలో ఒక్కరిగా జీవనం సాగించే హీరోయిన్-ఆ హీరోయిన్ చూసిన వెంటనే పగని మరిచి ఆమెని తనదాన్ని చేసుకోవాలనుకునే విలన్ భారీ నుండి ఆ హీరోయిన్ ని కాపాడటమే కాకుండా ఊరిని కూడా కాపాడే పాత్ర హీరోది”.

ఇలాంటి స్టోరీతో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి పోయాయి, కథ కానీ స్టోరీ కానీ ఏమాత్రం కొత్తది కాదు కానీ ఇక్కడ నడిచే మ్యాటర్ మాత్రం కేవలం కథనం మరియు పవన్ మ్యానరిజం. ఈ రెండింటితోనే సినిమా 2 గంటల 44 నిమిషాలు కుర్చీలో అభిమానులతో పాటు కామన్ ఆడియన్ ని కూడా ఎంజాయ్ చేసేలా చేసింది సర్దార్ గబ్బర్ సింగ్.

నరేషన్ స్లో గా ఉన్నా దేవి పాటలు గబ్బర్ సింగ్ రేంజ్ లో లేకున్నా పవన్ ఎంటర్ అయినప్పటి నుండి చివరి వరకు వన్ మ్యాన్ షో చేసి అలరించాడు. కానీ ఈ స్టోరీ అందరికీ నచ్చేది మాత్రం కాదని చెప్పొచ్చు. అత్తారింటికి దారేది లాంటి క్లాస్ సినిమాతో అలరించిన పవన్ ఇప్పుడు కేవలం మాస్ ని మాత్రమే ఆకట్టుకునే సినిమా చేయడం కొందరికి నచ్చదు.

కానీ పవన్ రియల్ ఫాలోయింగ్ మాస్ లోనే ఉంది కాబట్టి సినిమా కచ్చితంగా వారిని అలరిస్తుందని చెప్పొచ్చు. కాగా ఇక్కడ అసలు మ్యాటర్ అల్లా ఇప్పుడు సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనీ..తొలి వీకెండ్ కలెక్షన్స్ కి డోకా లేదు. వీకెండ్ కల్లా 50 కోట్ల షేర్ వచ్చేయడం ఖాయం.

కానీ టోటల్ గా సినిమా హిట్ అనిపించుకోవడానికి తెలుగులో 84 కోట్లు, టోటల్ గా 105 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. కానీ సినిమా టాక్ ఎలా ఉన్నా సమ్మర్ లో మరో మెగా మూవీ రిలీజ్ అయ్యేవరకు చూసే ప్రతీ ఒక్కరు సినిమాను తరోగా ఎంజాయ్ చేస్తారు.

టాలీవుడ్2బాలీవుడ్ సర్దార్ గబ్బర్ సింగ్ కి

ఇచ్చే రేటింగ్———3/5

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY