నాగార్జున “ఊపిరి” కామన్ ఆడియన్స్ టాక్-మినీ రివ్యూ

0
1073

మనం సినిమా ముందువరకు నాగార్జున సినిమాలను పెద్దగా పట్టించుకున్నవాళ్ళు లేరు కానీ ఎప్పుడైతే మనం ఎవ్వరి ఊహలకందని విజయం సాధించిందో అప్పటినుండి నాగ్ తిరిగి అందరివాడయ్యాడు. ఇక ఈ ఇయర్ సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో సంక్రాంతి కి ఊహించని రియల్ విన్నర్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అలాంటి నాగార్జున నటించిన ఊపిరి సినిమా ఇవాళ విడుదల అయ్యింది మరి సినిమా ఎలా అనిపించిందో చూద్దాం పదండి.

nagarjuna oopiri mini reviewసినిమా స్టార్ట్ అయిన మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకు అంతా తానై నడిపించాడు నాగార్జున. నాగ్ కి కార్తీ ఎనర్జీ తోడవ్వడం దానికి తమన్నా గ్లామర్ అద్దడంతో ఫస్టాఫ్ మొత్తం ఎంతో హాయిగా సాగిపోతుంది. ఇక సెకెండాఫ్ లో అక్కడక్కడా స్లో అవుతున్నట్లు అనిపించినా హృదయానికి హత్తుకునే అద్బుతమైన సన్నివేశాలు ఆ బోర్ ని ఏమాత్రం లెక్క చేయవు.

ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి విసుగుచెందే ప్రేక్షకులకు ఊపిరి సినిమా ఓ తియ్యని గుర్తుని మిగిలిస్తుంది. ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో చాలా అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడు మిస్ చేసుకుంటే ఇలాంటి సినిమాలను తీయాలనుకునేవారికి కూడా మనసు రాదు.

కాబట్టి సంక్రాంతి తరువాత సరైన సినిమాలు లేక విసుగు చెందిన ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఫ్రెండ్ షిప్ చేసే ప్రతీ ఒక్కరికీ ఊపిరి కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాతో నాగార్జున తన కెరీర్ లో టాప్ 5 బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచే అద్బుత నటనను చూపించాడు.

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో పాటలు అనుకున్న విధంగా సెట్ అవ్వలేదు, అలాగే కొద్దిగా సాగాదీత కొందరికి మింగుడుపడని విషయ౦ అవుతుంది. అలాగే లెంత్ కూడా ఒకవిధమైన మైనస్ అవుతుంది వాళ్లకి.ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ గురించి మాత్రమే,

ఓవరాల్ గా ఊపిరి సినిమా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వచ్చిన మంచి సినిమాల్లో మంచి సినిమా. వంశీ పైడిపెల్లి లాంటి మాస్ డైరెక్టర్ ఇలాంటి స్మూత్ సినిమాను ఇంతబాగా హ్యాండిల్ చేస్తాడని ఎవ్వరూ ఊహించరు. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ్ ప్రజెంట్ ఫాంని చూస్తే కచ్చితంగా అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యి హాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం.

టాలీవుడ్2బాలీవుడ్ ఊపిరి సినిమాకు ఇస్తున్న రేటింగ్—–3.25/5

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY