ఎన్టీఆర్ పేరు చెబితే చాలు పని అయిపోయిందట

0
2492

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ పై ట్రేడ్ లోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనిఉన్నాయి. మూడు వరుస హిట్ల తర్వాత చేయబోతున్న ఈ సినిమా కోసం టోటల్ ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.

కాగా ఈ సినిమాలో నటించే కాస్ట్ అండ్ క్రూ ఎవరో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా వీళ్ళు నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ ప్రచారం అవుతుంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న ఓ ఇద్దరు ఈ సినిమాకి పని చేయబోతున్నారట.

వాళ్ళలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్ కాగా మరొకరు జగపతిబాబు అని అంటున్నారు…టాలీవుడ్ నుండి మోస్ట్ బిజీ పెర్సన్స్ ఈ 2 కచ్చితంగా ముందు ఉంటారు. అయినా కూడా ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

LEAVE A REPLY