మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” పోస్ట్ మార్టం “డిసాస్టర్ ఆఫ్ ది ఇయర్”

23
5322

ఇలా ఓ సినిమా రిలీజ్ రోజునే డిసాస్టర్ అని చెప్పడం మర్యాద కాదు అని తెలిసినా చెప్పక తప్పని పరిస్థితి. ఒక సినిమా ప్రేక్షకులను ఏ అంశంలోనూ ఆకట్టుకోకపోగా మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు చిరాకు పెట్టిస్తే అలాంటి సినిమా గురించి నలుగురికి చెప్పడం తప్పు కాదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత చేసిన సినిమా బ్రహ్మోత్సవం. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా తొలి 10 నిమిషాల్లోనే సినిమా ఫేట్ ఎలా ఉందో అర్ధం అయ్యేలా చేసింది కానీ మరీ ఇంట దిగజారుతుందని ఎవ్వరూ ఊహలో కూడా ఊహించి ఉండరు.

postmortam of brahmostavamసీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సూపర్ హిట్ తరువాత మహేష్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పై ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలకు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మోత్సవం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద డిసాస్టర్స్ లో ఒకటిగా చేరబోతుందని చెప్పొచ్చు.

థియేటర్ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులను టార్చర్ చేస్తూ తొలి 30 నిమిషాల్లోనే 4 పాటలు పెట్టాడు దర్శకుడు. అది మొదటి మైనస్ పాయింట్, సీన్ సీన్ కి సంభందం లేకుండా వచ్చి వెళ్ళే పాత్రలు ప్రేక్షకులను చిరాకు తెప్పించాయి.

మహేష్ కి నటించడానికి ఎలాంటి అవకాశం లేని రోల్ లో మూడ్ గానే సినిమా అంతా కనిపించాడు మహేష్, దూకుడు నుండి ఒకే లుక్ లో కనిపిస్తున్న మహేష్ ని అలాగే చూసి చూసి బోర్ కొట్టేశాడని కూడా చెప్పొచ్చు.

ఇక కాజల్ అలా ఎందుకు ప్రవర్తిస్తుందో, ఎందుకు సడెన్ గా వచ్చి వెళ్ళిపోతుందో, సమంత ఎక్కడ నుండి వచ్చిందో శ్రీకాంత్ కే తెలియాలి. హీరోకి తన తండ్రి విడిపోయిన రావ్ రమేష్ ని కలపమని చెబితే అది పక్కకు పడేసి తన తండ్రి తరుపు చుట్టాలను వెతికే పనిలో సెకెండాఫ్ మొత్తం నడిపాడు శ్రీకాంత్.

దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందీ అంటే అదీ లేదు, లోకేషన్స్ కి కోట్లకుకోట్లు ఖర్చు చేసి నిర్మాతకు బడ్జెట్ పెంచారు తప్పితే మరేంలేదు. ఇలా చెప్పుకుంటూ పొతే సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులను జుట్టుపట్టుకునేలా చేస్తుంది.

ఒక అభిమాని మాతో చెబుతూ “వాళ్ళ ఊర్లో సినిమా చూస్తున్న థియేటర్ లో సినిమా పడిన షో తరువాత ఫస్టాఫ్ కి సగం జనాలు వెళిపోగా సెకండాఫ్ పూర్తి అయ్యేలోపు థియేటర్ లో పట్టుమని 50 మంది కూడా లేరని” చెప్పాడు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకు 75 కోట్ల టార్గెట్ ఉంది, అందులో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఫ్యామిలీ ఆడియన్స్ మీదే ఉంటుంది. ఇకనైనా మహేష్ ఇలాంటి చవకబారు కథలను చేయకుండా ఉండటం బెటర్.

మీరు సినిమా చూసి ఉంటే…ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

23 COMMENTS

 1. not agree with dis article…bcoz sarrainodu kuda divide talk vacchindhi flop annaru kani ippudu 60cr share super hit antunaru…so ikda talk kante collections dhe domination ainapdu meeru first day ne disaster ani yela declare chestharu inthakante ghoramaina talk vacchina Sardar ki ilanti article veiledhu but ee movie ki mathram yendhuku…Okavela poor collections tho losses vasthe apdu publish cheskondi Ilaanti article vandha…
  vacchestharu first day ne result estimate cheskoni…adhi kuda disaster of d decade anta
  really shame on u sir.

 2. not agree with dis article…bcoz sarrainodu kuda divide talk vacchindhi flop annaru kani ippudu 60cr share super hit antunaru…so ikda talk kante collections dhe domination ainapdu meeru first day ne disaster ani yela declare chestharu inthakante ghoramaina talk vacchina Sardar ki ilanti article veiledhu but ee movie ki mathram yendhuku…Okavela poor collections tho losses vasthe apdu publish cheskondi Ilaanti article vandha…
  vacchestharu first day ne result estimate cheskoni…adhi kuda disaster of d decade anta
  really shame on u sir.

 3. edo serial chusi natu vundi chetta story scrap ekkuva ga vundi better to trim the movie to 1 hour so that collections ayina vastai…

 4. బ్రహ్మోత్సవం కు వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి….
  1….ముఖ్యంగా తాళాల గుత్తి తెసుకెళ్ళండి,
  2….హాస్పిటల్ లో ఒక బెడ్ బుక్ చేసుకొని వెళ్తే ఇంకా మంచిది,
  3…..60 సంవత్సరాలు దాటినా వాళ్ళు వీలునామా రాసి వెళ్ళండి,
  4…సినిమా మధ్యలో మీ బట్టలు చించుకోవలనిపిస్తుంది కాబట్టి ఒక జత బట్టలు తీసుకెళ్ళండి,
  ఈ mesage ను ముగ్గురికి పంపండి వాళ్ళని మరో ముగ్గురికి పంపామనండి

 5. Assalu endhuku teesaro ee movie. Assalu mahesh babu
  ee Story vine chesara. Chala boaring movie. Really my family very upset with this movie. Plz Mahesh babu garu ee sari alochinchi movie theeyandi. Chala hopes pettukoni movie ki vastham kani eppudu a movie kuda intha boarkottala. Oka joke ledhu. Song’s bagoledhu. Antha mandi artist lu unna a seen antha Ledhu. Mahesh babu anagaane oka pokiri movie, dookudu alanti movies expect chesi vastham. kani ilanti movie inka eppudu cheyakandi plz.

 6. Oka vela brahmotsvam evaru cheppina vinakunda vellarente vellandi kani nadi oka suggestion ameti ante zandu balm matram marchipokandi please please please please …………………………………..

 7. sorry to say that this movie is the disaster movie of this year………
  i feel very sad because i am also prince mahesh fan……..but prince will come back with another block buster with in short period…………all the best prince MAHESH……BABU

LEAVE A REPLY