రామ్ చరణ్ ధృవ…రివ్యూ….కామన్ ఆడియన్స్ టాక్

14
1424

ఎవడు లాంటి సూపర్ హిట్ తర్వాత గోవిందుడు అందరివాడేలే మరియు బ్రూస్ లీ లాంటి నిరాశాజనక చిత్రాల తరువాత టాప్ హీరోల లిస్టులో మెల్లగా వెనక్కి వెళ్ళిపోయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన రూట్ ని పూర్తిగా మార్చేసి కంటెంట్ ఉన్న కథల కోసం అన్వేషిస్తున్న సమయంలో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తనీఒరువన్ సినిమా నచ్చి తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేశాడు.

ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ధృవ ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది…కానీ ఎక్కడో డౌట్ ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఎక్కువమంది మాస్ ఆడియన్స్, మరి ధృవ వాళ్ళని ఆకట్టుకుంటు౦దా అనే ప్రశ్నకి జవాబు ఇప్పుడు తేలనుంది…..

ముందుగా రామ్ చరణ్ ఇది తన మాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా కాదు….తనని తాను నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నంలో రామ్ చరణ్ కి నూటికి నూరు మార్కులు పడ్డాయి. బహుశా మగధీర తర్వాత రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పొచ్చు.

రామ్ చరణ్ కన్నా కూడా ఎక్కువ మార్కులు అరవింద్ స్వామి కొట్టేశాడు ఈ సినిమా…సినిమా ఒరిజినల్ వర్షన్ లోను హీరోగా చేసిన జయం రవి కన్నా ఎక్కువ మార్కులు అరవింద్ స్వామికే దక్కాయి. డానికి కారణం ఆ క్యారెక్టర్ కి ఉన్న వెయిట్…ఇక్కడ రామ్ చరణ్ పెద్ద హీరోనే అయినా కంటెంట్ ని మార్చకుండా అలాగే ఉంచి మంచి పని చేశాడు.

రకుల్ గ్లామర్ తో అదరగొట్టగా పోసాని కొన్ని సీన్స్ లో ఓ రేంజ్ లో నవ్వించాడు…సురేందర్ రెడ్డి టేకింగ్ అండ్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు అమోఘం. ఇక టెక్నీషియన్స్ లో అందరికన్నా ఎక్కువ మార్కులు మ్యూజిక్ డైరెక్టర్ హిప్పాప్ తముజాకే దక్కుతుంది…సంగీతం ఒకెత్తు అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో ఎత్తుగా నిలిచింది…

ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ ఫుల్ స్పీడ్ తో సాగి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా ఎక్కడా బోర్ కొట్టలేదు…దాంతో ఓవరాల్ గా సినిమాకి పాజిటివ్ మార్కులు తెచ్చుకుంది.

కానీ రామ్ చరణ్ హార్డ్ కోర్ మాస్ ఫ్యాన్స్ కి ఇందులో పెట్టిన ఫైట్స్ తప్ప మిగిలిన కథ అంతగా ఎక్కదు అనేది కామన్ ఆడియన్స్ టాక్. అయినా కూడా దాదాపు 4 నెలలుగా పెద్ద సినిమాలు లేకపోవడంతో కచ్చితంగా ఒకసారి చూడొచ్చు వాళ్ళు కూడా.

బాక్స్ ఆఫీస్ పాయిట్ ఆఫ్ వ్యూ లో ధృవ మౌత్ టాక్ పై ఆధారపడ్డ సినిమా…కానీ కామన్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు మెండుగా ఉండటం ధృవ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్…అదే సమయంలో కామెడీ…అండ్ ఎక్కువ యాక్షన్ ని కోరుకునేవాళ్ళకి ఒకసారి ఈజీగా చూసే సినిమా ధృవ…మీరు సినిమా చూస్తె ఎలా ఉందొ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

14 COMMENTS

  1. Super movie cherry is a great performance and aravind swami he is superb Rakul she is very beautiful MOVIE BLOCK BUSTER

LEAVE A REPLY