సర్దార్ గబ్బర్ సింగ్ రియల్ గా రాసుకున్న స్టోరీ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

32
24166

sardhar real storyపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి రెండేళ్ళు రాసిన సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా తరువాత చల్లబడి టోటల్ గా 53 కోట్లలోపు తన బాక్స్ ఆఫీస్ రన్ ను ముగించింది.

కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు ముందు అనుకున్న స్టోరీ ఇది కాదని అంటున్నారు. ముందు అనుకున్న స్టోరీలో పవన్ డ్యూయల్ రోల్ ఉందట, ఓ పవర్ ఫుల్ సర్దార్ పోలిస్ రతన్ పూర్ లో విలన్ల బెండు తీస్తూ అందరినీ కాపాడుతుండగా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో కోమాలోకి వెళతాడట.

తరువాత ప్రజలని కాపాడటానికి సర్దార్ పోలికలతో ఉండే గబ్బర్ సింగ్ ని రతన్ పూర్ కి రప్పిస్తారట, తరువాత గబ్బర్ సింగ్ తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ విలన్ల బెండు తీస్తూ ఉండగా సర్దార్ వేరే ఉన్నాడని తెలుస్తుందట. తరువాత ఇద్దరూ కలిసి విలన్ల బెండు ఎలా తీశారు అన్నది మొదటి వర్షన్ కథ అట.

ఆ కథ కోసమే పవన్ కళ్యాణ్ జుట్టు మరియు గడ్డం పెంచాడు, కానీ ఏమైందో తెలియదు కానీ కథను మార్చి సోలో రోల్ చేయడానికి సిద్ధమయ్యి కథని మార్చి రెండో వర్షన్ ని తెరకెక్కించాడు అంటున్నారు. మరి మొదటిది చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా….కమెంట్ సెక్షన్ లో మీ థాట్స్ చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

32 COMMENTS

LEAVE A REPLY