నా పెళ్ళికి ఎన్టీఆర్ వస్తే చూడటానికి వచ్చిన జనలాను చూసి తిరిగెళ్ళటానికి ఇల్లు ఎక్కేల్లాడు—వినాయక్

0
10708

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్…కెరీర్ తొలినాళ్ళలోనే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆది సినిమాతో వెనుతిరిగి చూసుకోలేదు ఇక. సింహాద్రితో స్టార్ హీరోగా మారి ఇప్పుడు టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు.

కాగా లేటెస్ట్ గా ఆది సమయంలో ఓ ఆసక్తికర సంఘటనని వినాయక్ చెప్పాడు…ఆదితోనే కెరీర్ మొదలుపెట్టిన వినాయక్…ఆది సూపర్ తర్వాత పెళ్లి చేసుకోగా ఆ పెళ్లికి ఎన్టీఆర్ వచ్చాడట…కానీ అక్కడ ఎన్టీఆర్ చూడటానికి జనాలు విపరీతంగా ఎగబడటంతో తిరిగి వెళ్ళడానికి నానా కష్టాలు పడ్డాడట ఎన్టీఆర్…

అందరినీ తప్పించుకోవడానికి ఇల్లు ఎక్కి అలా అలా తిరిగి వెళ్లాడ౦టూ వినాయక్ ఎన్టీఆర్ గురించి తెలియజేశాడు…ఎన్టీఆర్ ఆది సినిమా ఒప్పుకోవడం తన కెరీర్ లో ఎక్కువగా సంతోషించిన విషయం అన్న వినాయక్ కుదిరితే అదుర్స్ 2 కచ్చితంగా ఎన్టీఆర్ తో చేస్తానని అంటున్నాడు.

LEAVE A REPLY