బడ్జెట్ 6 కోట్లు…అమ్మింది 4.8 కోట్లు….టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2416

  కెరీర్ ని విలన్ గా మొదలు పెట్టి తర్వాత హీరోగా మారి ఒకటి అరా హిట్లు కొట్టినా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సూపర్ సక్సెస్ కొట్టి మంచి ప్రామిసింగ్ హీరో ఆఫ్ టాలీవుడ్ గా మారిన యంగ్ హీరో సందీప్ కిషన్… కానీ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినా క్లీన్ హిట్లు మాత్రం ఈ హీరో జాబితాలో పెద్దగా పడలేదు…దాంతో తమిళ్ ఇండస్ట్రీ లోను అడుగుపెట్టిన సందీప్ కి అక్కడ మంచి పేరు లభించింది.

రీసెంట్ గా కేరాఫ్ సూర్యా అంటూ తెలుగు తమిళ్ బైలింగువల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. తెలుగు తమిళ్ లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్కడ నెగటివ్ టాక్ రావడం తో హీరోయిన్ మెహ్రీన్ ఎపిసోడ్స్ అన్నీ డిలేట్ చేసి మళ్ళీ రీ రిలీజ్ చేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు.

సినిమా ఓవరాల్ గా 6 కోట్ల బడ్జెట్ లో తెలుగు తమిళ్ లో రూపొందగా మొత్తం మీద బిజినెస్ 4.8 కోట్ల రేంజ్ లో జరిగింది. కానీ మొత్తం మీద కేవలం 1.26 కోట్ల షేర్ ని తెలుగు తమిళ్ లో కలిపి అందుకుని సుమారు 3 కోట్లకు పైగా నష్టాలను మిగిలించి ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here