నాగచైతన్య తప్పించుకున్నాడు…సాయిధరంతేజ్ బలయ్యాడు!!

0
2076

ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్ళడం కామనే అని చెప్పాలి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఫ్లాఫ్ మూవీస్ ఒక హీరో నుండి వేరే హీరోల దగ్గరకు మారి మారి చివరికి ఒక హీరో దగ్గర సెటిల్ అయ్యాయి. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన ఇంటెలిజెంట్ మూవీ రిలీజ్ అయిన మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుని షాక్ ఇచ్చింది.

ఇలాంటి సినిమాను అసలు సాయి ధరం తేజ్ ఎందుకు చేశాడు…అసలు ఈ సినిమాకి దర్శకుడు వినాయకేనా అన్న అనుమానాలు ఇండస్ట్రీ లో వెల్లువెత్తుతున్న సమయంలో ఈ సినిమా కథ సాయి ధరం తేజ్ కోసమే పుట్టింది అని అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ ఒక న్యూస్ తెలిసింది.

ఈ సినిమాకి కథ రాసిన ఆకుల శివ సినిమా కథ ని డమరుకం సమయంలో నాగచైతన్యకి వినిపించాడట… చాలా కాలంగా నికార్సయిన మాస్ మూవీ కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తున్న నాగచైతన్య ఈ కథ విని ఎక్కడో తేడా కొడుతుంది అని నో చెప్పగా తర్వాత సాయి ధరం తేజ్ ని పిలవడం కథ చెప్పడం… వినాయక్ ఎంటర్ అవ్వడం తో సాయి ధరం తేజ్ సినిమా చేసి ఇప్పుడు బలయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here