జనవరి 19…డేట్ గుర్తు పెట్టుకోండి…మెగా ఫ్యాన్స్ కి పూనకాలే ఆ రోజు

0
3267

  కెరీర్ రెండో సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను చెరిపేసిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్….తర్వాత యావరేజ్ సినిమాలతో 40 కోట్ల మార్క్ ని అందుకుంటూ దూసుకుపోతున్న రామ్ చరణ్ మాస్ బాట మాని ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో దుమ్ము లేపుతున్నాడు. ధృవ తో రూట్ మార్చిన రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం సినిమాతో ప్రయోగాత్మక సినిమా లోనే మాస్ ని మెప్పించే రోల్ చేస్తూ దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు.

కాగా ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోతున్న సినిమా కన్ఫాం అయిన విషయం తెలిసిందే…బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా చేయబోతున్న అప్ కమింగ్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది…ఈ నెల 19 న భారీ ఎత్తున ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు.

కాగా ఈ ఈవెంట్ కి మెగా హీరోలు అటెండ్ అవ్వబోతున్నట్లు సమాచారం…కాగా రాజమౌళి సుకుమార్ లు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. భారీ అంచనాలతో తెరకెక్క నున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్ వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here