రామ్ చరణ్…ఇంత రిస్క్ అవసరమా???

0
1370

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధృవతో తిరిగి ఫామ్ లోకొచ్చి ఇప్పుడు మళ్ళీ సుకుమార్ తో ఓ అతిపెద్ద ప్రయోగం చేయబోతున్నాడు. రొటీన్ మాస్ మూవీస్ చేస్తున్నాడు అని విమర్శించినవాళ్ళకి సమాదానం ఈ సినిమా అవుతుందని చరణ్ ఆశిస్తున్నాడు.

కాగా సుకుమార్ తో సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంభందించిన ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సినిమా మొత్తం 90% కి పైగా రామ్ చరణ్ డీగ్లామర్ గానే కనిపించబోతున్నాడట.

కాగా ఇది విన్నవాళ్ళు కెరీర్ తో ఇలాంటి రిస్క్ చేయడం అవసరమా…అంత డీగ్లామరైజ్ రోల్ ఎందుకు చేస్తున్నావని అంటున్నారట. దానికి చరణ్ సినిమా రిలీజ్ అయ్యాక సమాదానం చెబుతా అని అంటున్నాడని అంటున్నారు. ఈ సినిమా ఈ దసరాకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here