చి.ల.సౌ టోటల్ కలెక్షన్స్…మంచి సినిమా…షాకింగ్ కలెక్షన్స్

0
1966

కొన్ని కొన్ని సార్లు మంచి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ వలనో, ప్రమోషన్ సరిగ్గా లేకపోవడంలో మరే ఇతర కారణాల వలనో అనుకున్న రేంజ్ లో విజయాలను అందుకోలేకపోతాయి. అలాంటి కోవలోకే వచ్చే సినిమా చి.ల.సౌ….మంచి ఫీల్ గుడ్ మూవీ గా టాక్ సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా జోరు చూపలేకపోయింది ఈ సినిమా.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా మినిమమ్ 3.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ లో 2.1 కోట్ల షేర్ ని మాత్రమే సాధించగలిగింది.

టాక్ బాగున్న మరీ క్లాస్ గా ఉండటం, పోటీలో గూఢచారి సినిమా ఫుల్ జోరు చూపడం ఈ సినిమా కి ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు. దాంతో టాక్ బాగానే ఉన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకోలేక ఫ్లాఫ్ గా మిగిలిపోయింది ఈ సినిమా. సోలో గా రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా సినిమా క్లీన్ హిట్ గా నిలిచేది అని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here