20 నిమిషాల్లో ప్రపంచ వ్యాప్త భీభత్సం…మెగాస్టార్ మైటీ క్రేజ్ పవర్

0
727

  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో ప్రతిష్టాత్మక 150 వ సినిమా ఖైదీనంబర్ 150 తో అందరికీ అర్ధం అయ్యింది. 80 కోట్లు కొట్టడానికే స్టార్స్ కష్టపడుతుంటే ఏకంగా 104 కోట్ల షేర్ తో తెలిసిన కథ తోనే అల్టిమేట్ రికార్డుల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకoగా చేస్తున్న సినిమా సైరా నరసింహ రెడ్డి. రామ్ చరణ్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ డిసెంబర్ 6 నుండి జరగనుంది.

దాంతో సోషల్ మీడియా లో మెగాస్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతూ దూసుకు పోతున్నారు…ఇలా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిందో లేదో జస్ట్ 20 నిమిషాల్లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేసి అల్టిమేట్ మెగాస్టార్ మైటీ క్రేజ్ పవర్ ఏంటో తెలియజేశారు మెగా ఫాన్స్.

ఇక అత్యంత భారీ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ మూవీ కుదిరితే 2018 లో లేకపోతె 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా మెగాస్టార్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here