శైలజారెడ్డి అల్లుడు 1st డే ఓపెనింగ్స్..కెరీర్ బెస్ట్ పక్కా

0
351

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా ఓపెన్ అయ్యింది. సినిమా సుమారు 700 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా వినాయక చవితి పూజ వలన మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి కొంత ఎదురుదెబ్బ తగిలింది.

కానీ ఓవరాల్ గా 55% వరకు ఆక్యుపెన్సీ తో ఓపెన్ అయిన శైలజా రెడ్డి అల్లుడు ఈవినింగ్ షోల కి భారీ గా పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే సినిమా ఈజీగా 4.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందట.

అనుకున్నట్లే సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి గ్రోత్ భారీ గా సాధిస్తే ఈ లెక్క 5 కోట్లు ఆ పైనే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా రోజు ముగిసే సరికి స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here