అరవింద సమేత డే 22 కలెక్షన్స్…హోల్డ్ చేసింది

0
1076

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మూడు వారాలను పూర్తి చేసుకోగా సినిమా రెండు రాష్ట్రాలలో 73 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.8 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక సినిమా నాలుగో వారంలో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోగా కేవలం 180 లోపు థియేటర్స్ లోనే పరుగును కొనసాగిస్తుంది. కాగా సినిమా కలెక్షన్స్ 22 వ రోజు కొంత సర్ప్రైజ్ చేశాయి అని చెప్పాలి.

రెండు రాష్ట్రాలలో మరోసారి 20 మరియు 21 వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 వ రోజున అందుకోనుంది, మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ తగ్గినా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల కి సినిమా కొద్దిగా పుంజుకుంది.

దాంతో ఓవరాల్ గా 22 వ రోజు సినిమా కలెక్షన్స్ 21 వ రోజు తో పోల్చితే తగ్గుతుంది అనుకున్నా హోల్డ్ చేసి స్టడీ గా మరోసారి 8 నుండి 10 లక్షల లోపు షేర్ ని సినిమా సాధించే అవకాశం ఉంది. దాంతో సినిమా 4 వ వీకెండ్ మినిమమ్ కలెక్షన్స్ తో రన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే మొత్తం మీద 2 వారాల్లో 20.6 కోట్ల షేర్ ని అందుకోగా 15 వ రోజు 14 వ రోజు లెవల్ లోనే ఓపెన్ అయ్యి ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కూడా అదే రేంజ్ ఆక్యుపెన్సీ ని సాధించడంతో సినిమా మరో సారి 15 లక్షల లోపు షేర్ ని అందుకోవచ్చని అంటున్నారు.

ఇక విశాల్ పందెం కోడి 2 భారీ గా స్లో అయ్యి 3 లక్షల లోపు షేర్ ని అందుకునేలా ఉంది…. ఇక కొత్త సినిమా సవ్యసాచి భారీ గా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా థియేటర్స్ చాలా వరకు ఆ సినిమాకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here