అజ్ఞాతవాసి కి ఈ రోజు చావో రేవో….ఫ్యాన్స్ కి ఊపిరి పీల్చుకునే న్యూస్

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి టోటల్ గా మొదటి రోజు వసూళ్ళ పరంగా భీభత్సం సృష్టించినా రెండో రోజు నుండే అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన సినిమా ఎ దశలోనూ తేరుకోలేకపోయింది…మొత్తం మీద మూడు రోజుల్లో సినిమా 45.7 కోట్ల షేర్ ని మాత్రమె కలెక్ట్ చేయగా ఇప్పుడు కీలకమైన నాలుగో రోజు సంక్రాంతి అసలు సిసలు హాలిడేస్ లో తన లక్ ని పరీక్షించుకుంటుంది ఈ సినిమా.

ఈ రోజు కనుక సినిమా అనుకున్న అంచనాలను అందుకొకపొతే మాత్రం ముందే చెప్పినట్లు చరిత్రలో నిలిచి పోయే లాస్ అజ్ఞాతవాసి సొంతం అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ కి కొంచం సంతోషించే న్యూస్ ఏంటి అంటే…

మూడో రోజుతో పోల్చితే నాలుగో రోజు ఓపెనింగ్స్ పరంగా కొంచం బెటర్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకుంది…విక్టరీ వెంకటేష్ క్యామియో గురించి న్యూస్ రావడంతో ఫ్యాన్స్ మరోసారి సినిమా చూడటానికి థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి టోటల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో రాత్రి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

Leave a Comment