డే 7 బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏంటో తెలుసా??…ఈ రోజు టార్గెట్ ఇదే

0
1480

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో 48.5 కోట్లు వసూల్ చేయగా తొలి 6 రోజులు దసరా హాలిడేస్ ఉండటం తో సినిమా మంచి వసూళ్లు కురిపించింది. కాగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వర్కింగ్ ని ఎదుర్కొన్న స్పైడర్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ని 7 వ రోజు సాధిస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా స్పైడర్ 7 వ రోజున పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే…

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాలిడేస్ అయిపోవడం తో స్పైడర్ కి బి సి సెంటర్స్ తో పాటు ఎ సెంటర్స్ లోను భారీ డ్రాప్స్ కనిపించాయి. 6 వ రోజు తో పోల్చితే దాదాపు 50% డ్రాప్స్ దక్కించుకున్న స్పైడర్ మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కాగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా ఈ రోజు 1 కోటి కి అటూఇటూగా షేర్ వసూల్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. మిగిలిన చోట్ల మరో 20 లక్షల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటుండటం తో మొత్తం మీద రోజు ముగిసే సమయానికి 1.2 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here