దేవదాస్ డే 2 ఓపెనింగ్స్…షాకింగ్ డ్రాప్స్

0
295

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు మంచి వసూళ్లనే సాధించింది.

ఓవరాల్ గా 7.1 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు తో పోల్చుకుంటే భారీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది…రెండో రోజు శుక్రవారం వర్కింగ్ డే అవ్వడంతో డ్రాప్స్ కామనే కానీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ డ్రాప్స్ ఉన్నాయట.

ఆల్ మోస్ట్ 55% డ్రాప్స్ కనిపించడంతో ఈవినింగ్ షోల కి సినిమా భారీ గా పుంజుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రేడ్ అంచనా ప్రకారం సినిమా రెండో రోజు 2.25 నుండి 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here