దేవదాస్ బుకింగ్స్ రిపోర్ట్…1st డే ఎంత రావచ్చు??

0
321

కింగ్ నాగార్జున… నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఓవరాల్ గా 37.2 కోట్ల బిజినెస్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 750 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది.

ఇక సినిమా కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని పరిశీలిస్తే మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ 55% టు 60% వరకు ఉన్నట్లు సమాచారం…ఇక ఆఫ్ లైన్ లో జరిగిన బుకింగ్స్ ఓవరాల్ గా 30-35% వరకు బుకింగ్స్ జరిగినట్లు చెబుతున్నారు.

ఒకవేళ టాక్ బాగుంటే కచ్చితంగా సినిమా భారీ గా పుంజుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు…ప్రస్తుతం జరిగిన ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే అవలీలగా సినిమా 5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ రెండు రాష్ట్రాలలో అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి టాక్ బాగుంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here