దేవదాస్ టోటల్ బిజినెస్….చాలా గట్టిగా కొట్టాలి సామి

0
748

కింగ్ నాగార్జున…నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ దేవదాస్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఓవరాల్ గా ఈ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇద్దరు స్టార్స్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు.

నైజాంలో 11 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 13 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది…టోటల్ గా రెండు రాష్ట్రాలలో ఏకంగా 30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి సుమారు 2.6 కోట్ల బిజినెస్ జరగగా….

టోటల్ ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ టోటల్ గా 4.6 కోట్ల రేంజ్ లో జరిగింది. దాంతో రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా 7.2 కోట్ల బిజినెస్ దక్కించుకున్న దేవదాస్ టోటల్ వరల్డ్ వైడ్ గా 37.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని దక్కించుకుంది…ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 38 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here