అమ్మింది 7…వచ్చింది 2…దిల్ రాజు కి రక్తకన్నీరు!

0
5106

గత ఏడాది ఒకటి తర్వాత ఒకటి వరుస సక్సెస్ లతో ఇయర్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశాడు దిల్ రాజు. డబుల్ హాట్రిక్ కొట్టి ఊపు మీదున్న దిల్ రాజు కి ఈ ఇయర్ ఎందుకనో పెద్దగా కలిసి రావడం లేదు. రిలీజ్ కి ముందు నుండి మంచి అంచనాలు ఉన్న రాజ్ తరుణ్ లవర్ భారీ షాక్ ఇచ్చింది.

సినిమాను మొత్తం మీద 7 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఏ దశలోనూ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో వీకెండ్ తర్వాతే చాలా ఏరియాల్లో తొలగించబడింది. ఆ ప్రభావం కలెక్షన్స్ పై కూడా పడింది.

టోటల్ రన్ లో రెండు రాష్ట్రాలలో 2 కోట్ల వరకు షేర్ ని వరల్డ్ వైడ్ గా 2.4 కోట్ల వరకు షేర్ ని మాత్రమే సాధించి భారీగా లాస్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాతో తన బ్యానర్ హిట్ ట్రాక్ కంటిన్యు అవుతుంది అనుకున్న దిల్ రాజు కి ఈ లాస్ తో షాక్ తగిలినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here