డిసాస్టర్ టాక్…కట్ చేస్తే వీకెండ్ కి 104 కోట్లు…ఈయన తోపు

0
216

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అలాగే ఉంది…సినిమా హిట్ కి ఫ్లాఫ్ కి సంబంధం లేకుండా స్టార్స్ నటించిన సినిమాలకు ఓపెనింగ్స్ పరంగా అల్టిమేట్ రికార్డ్ కలెక్షన్స్ తొలి వీకెండ్ లోనే వస్తుండటం విశేషం…టాలీవుడ్ అండ్ కోలివుడ్ లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండటం మరింత విశేషం అని చెప్పొచ్చు. ఈ విషయం బాలీవుడ్ కూడా ఈ మధ్య తెలుగు తమిళ్ ఇండస్ట్రీలతో పోల్చితే వెనకబడే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతుండటం మన స్టార్ హీరోల క్రేజ్ గురించి ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.

కోలివుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన అజిత్ కుమార్ నటించిన వివేగం సినిమాకు తొలి ఆటకే అక్కడ మరియు ఇక్కడ డిసాస్టర్ టాక్ వచ్చేసింది….కానీ సినిమాపై ఉన్న హైప్ అండ్ క్రేజ్ తో తొలి వీకెండ్ లో ఈ సినిమా హిస్టారికల్ వసూళ్ళతో పంబ రేపి అల్టిమేట్ రికార్డులను సృష్టించింది.. తొలి వీకెండ్ లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 104 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది చరిత్రకెక్కింది..

దాంతో అక్కడ ట్రేడ్ పండితులు ఈ సినిమా కలెక్షన్స్ చూసి నిజంగానే షాక్ అయ్యారు..ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఆ టాక్ కి అంటే మామూలు విషయం కాదని అజిత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి అజిత్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇది నికార్సయిన ఉదాహరణ అంటూ మెచ్చుకుంటున్నారు.

తమిళనాడు లో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ నుండే 33 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది…ఇక మిగిలిన చోట్ల కలెక్షన్స్ కలుపుకుని మొత్తంగా 21 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది ఈ సినిమా….దాంతో మొత్తం వీకెండ్ కలెక్షన్స్ 104 కోట్లను చేరడం జరిగింది…

కానీ సినిమా టాక్ పరంగా ఏమాత్రం బాగా లేకపోవడంతో సోమవారం నుండి డ్రాప్స్ కనిపించాయి…దాంతో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 185 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తే కానీ క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం లేని ఈ సినిమా ఇప్పుడు సేఫ్ అవ్వాలి అంటే మరో 70 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేయాల్సిన అవసరం నెలకొంది…

మరి టోటల్ రన్ లో 70 కోట్ల గ్రాస్ అందుకోవడం పెద్ద కష్టం కాదనే అనిపిస్తుంది…అజిత్ కి వీరం, వేదాలం లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ శివ ఈ సారి అలాంటి హిట్ టాక్ ఉన్న సినిమా ఇవ్వకున్నా తనదైన రీతిలో అల్టిమేట్ వసూళ్ళ ప్రభంజనం సృష్టించే సినిమా ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here