“12 కోట్ల” నుండి “1 కోటి”కి పడిపోయిన దర్శకుడు ఈయనే

0
16544

  ఒక్క హిట్ అయినా ఫ్లాఫ్ అయినా ఎవరిని ఎక్కడినుండి ఎక్కడికో తీసుకెళ్తుంది. ఫ్లాఫుల్లో ఉన్నవారికి హిట్ పడితే వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. హిట్స్ లో ఉన్నవారికి ఒక్క డిసాస్టర్ పడితే కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ లో పడిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పొజిషన్ లోనే ఉన్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన శ్రీనువైట్ల. కామెడీ సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిన శ్రీనువైట్ల దూకుడుతో టాప్ 5 డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు.

తనకు అంతటి పేరు తెచ్చిన దూకుడు ఫ్లేవర్ ని విడిచిపెట్టలేక అదే టెంప్లెట్ ను బాద్ షాకి, ఆగడుకి లాస్ట్ ఇయర్ బ్రూస్ లీకి వాడాడు. మూడిట్లో బాద్ షా ఒక్కటి సేఫ్ అవ్వగా మిగిలిన రెండు డిసాస్టర్స్ గా మిగిలాయి. ముఖ్యంగా 2015 ఇయర్ లో భారీ అంచనాల నడుమ వచ్చిన బ్రూస్ లీ ప్రతేఒక్కరినీ తీవ్రంగా నిరాశపరిచింది.

దాంతో దూకుడు తరువాత 12 కోట్లవరకు రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీనువైట్ల ఇప్పడు ఏకంగా 1 కోటికి పడిపోయాడు. మెగాహీరో వరుణ్ తేజ్ తో చేసిన  మిస్టర్  సినిమాకు 1 కోటి మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు…కానీ ఇప్పుడు భారీ సినిమా భారీ ఫ్లాఫ్ అవ్వడంతో శ్రీనువైట్ల ఇక తేరుకోలేడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here