ఫాస్టెస్ట్ 10 మిలియన్ తో యంగ్ టైగర్ భీభత్సం!

0
325

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత మూవీ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుండి అదిరిపోయే రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

సినిమా ట్రైలర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ తోను 327k లైక్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ను అందుకోగా ఇప్పుడు ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని మరో హిస్టారికల్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో బాహుబలి తర్వాత..ఇంత ఫాస్ట్ గా 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకున్న ట్రైలర్ ఇదే…

ఇది వరకు రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాల ట్రైలర్స్ అన్నీ 2 రోజుల తర్వాతే 10 మిలియన్స్ మార్క్ ని అందుకోగా అరవింద సమేత మాత్రం 2 రోజుల లోపే ఈ రికార్డ్ కొట్టి దుమ్ము లేపింది…సినిమా పై ఉన్న క్రేజ్ ని అమాంతం పెంచేసిన ట్రైలర్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి గా మారింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here