ఫిదా 2వ సారి TRP రేటింగ్….ఆల్ టైం హిస్టారికల్!!

0
1019

  వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా… ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే అల్టిమేట్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుని టోటల్ రన్ లో ఎవ్వరూ ఊహించని విధంగా 48.5 కోట్ల షేర్ ని అందుకుని చిన్న సినిమాలలో బాహుబలి రేంజ్ విజయాన్ని అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించి సంచలనం సృష్టించింది ఈ సినిమా.

కాగా వెండితెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా భీభత్సం సృష్టించిన ఈ సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయిన సమయంలో రికార్డ్ లెవల్ లో 21.31 TRP రేటింగ్ ను దక్కించుకుని ఆల్ టైం టాప్ 10 TRP రేటింగ్ లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇప్పుడు రెండో సారి టెలికాస్ట్ సమయంలో కూడా భీభత్సం సృష్టిస్తూ ఏకంగా 18.36 TRP రేటింగ్ ను సాధించి అల్టిమేట్ రికార్డ్ నమోదు చేసింది. ఇది టాలివుడ్ చరిత్రలో సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన సినిమాలలో ఆల్ టైం రికార్డ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ రికార్డ్ చూస్తుంటే సినిమా కల్ట్ క్లాసిన్ అంటూ చెబుతుండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here