ఫిదా ఫైనల్ కలెక్షన్స్ అప్ డేట్…ఎన్ని రెట్ల లాభమో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

0
530

  బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ చిన్న సినిమా సృష్టించిన భీభత్సానికి పరాకాష్టగా ఫిదా సినిమా సాధించిన కలెక్షన్ల రికార్డుల గురించి చెప్పొచ్చు. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఎవ్వరి అంచనాలకు అందుకోకుండా భీభత్సమైన పాజిటివ్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్ల ప్రవాహం పెరిగి అనుకున్న లెక్కలను కూడా మించి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ చిన్న సినిమాల బాహుబలి గా పిలిపించుకుని సంచలనం సృష్టించిన సినిమాగా నిలిచింది ఫిదా సినిమా.

కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ రన్ లో 48.40 కోట్ల షేర్ ని వసూల్ చేసి బడ్జెట్ కి ఆల్ మోస్ట్ 6 రెట్ల వసూళ్ళ ని సాధించింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్ మోస్ట్ 18 కోట్లు అవ్వడంతో టోటల్ రన్ లో రెండున్నర రెట్లకి ఎక్కువగానే కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

నైజాం లో పెద్ద హీరోల కి మాత్రమె సాధ్యమయ్యే రేంజ్ లో 17.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా టోటల్ గా ఓవర్సీస్ లో 2.06 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 89.5 కోట్లను చేరుకొని మరో అల్టిమేట్ రికార్డ్ ను సృష్టించినా 90 కోట్ల మార్క్ ని కొన్ని ఏరియాలలో నడుస్తున్నందున క్రాస్ చేసే చాన్స్ ఉంది…మొత్తం మీద చిన్న సినిమాలలో ఇలాంటి అద్బుతం ఇప్పటి వరకు జరగలేదు..ఇక మీదట జరుగుతుందో లేదో తెలియదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here