ఇదే ఫైనల్…ఫైనల్ టాక్ ఇదే…

0
2536

మాస్ మహారాజ్ రవితేజ శ్రీను వైట్ల ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కి ప్రీమియర్ షోల ద్వారా యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ లభించిన విషయం తెలిసిందే. ఇక సినిమాకి రెగ్యులర్ షోల కి మొత్తం మీద ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ లో టాక్ రావడంతో కామన్ ఆడియన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ టాక్…

ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి తరలి వచ్చిన కామన్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా సినిమా కి టాక్ పరంగా పెద్దగా ఆశించిన ఫలితం ఏమి దక్కలేదు. వాళ్ళు కూడా యావరేజ్ గానే ఉందని డిక్లేర్ చేశారు.

రవితేజ కొంతవరకు ఆకట్టుకున్నా శ్రీనువైట్ల నుండి ఆశించిన కథ ఇది కాదని తేల్చేశారు. కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినా మిగిలిన సినిమా అంతగా ఆకట్టుకోలేదని, రవితేజ కోసం ఒకసారి చూడొచ్చు అని కంఫామ్ చేశారు. ఇక సినిమా టాక్ కి అతీతంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here