తెలుగు సినిమా చరిత్రలో మొదటి 25 కోట్ల ప్రీ రిలీజ్ మూవీ ఎదో తెలుసా???

1
3745

  తెలుగు సినిమా రోజురోజుకి ముందుకు వెళుతుంది…ఒకప్పుడు 30 కోట్లు-40 కోట్ల కలెక్షన్లే గొప్ప అనుకుంటున్న సమయంలో మగధీర తర్వాత తెలుగు సినిమా స్థాయి 75 కోట్ల క్లబ్ లో చేరగా తర్వాత బాహుబలి రాకతో 100 కోట్ల పైకి చేరుకుంది. కానీ టాలీవుడ్ హిస్టరీలో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఈ లెక్కలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండగా తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమా ఏది అన్న ఆసక్తికరమైన ప్రశ్న మా T2B Q&A లో ఒకరు అడిగారు…మాకు తెలినంతవరకు శోధించి ఆ సినిమా ఎదో గెస్ చేస్తున్నాం.

ఇండస్ట్రీ లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన జానీ తొలి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అని అంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాళ 23 కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా…కాగా ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఖుషి, సింహాద్రి సినిమాల తర్వాత రావడంతో భారీ అంచనాల నడుమ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని అంటున్నారు.

కానీ రెండు ఫ్లాఫ్ అవ్వడంతో కొన్నాళ్ళు 25 కోట్ల ప్రీ రిలీజ్ కి ఎవ్వరూ సిద్ధపడలేదని మళ్ళీ యమదొంగ సమయం నుండి 25 కోట్లకు పైగా బిజినెస్ మొదలైందని చెబుతున్నారు.  మీ దగ్గర ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్న ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here