గరుడ వేగ 3 వీక్స్ కలెక్షన్స్ || మంచి సినిమా || ఫ్లాఫ్ రిజల్ట్ ||

0
516

  సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ PSV గరుడ వేగ…. ప్రవీణ్ సత్తారు లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా మొదటి ఆటకే యునానిమస్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలలో ఈ మధ్య వచ్చిన బెస్ట్ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా 24 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా బిజినెస్ అంత జరగలేదు.

చాలా ఏరియాలలో లోకల్ డిస్ట్రిబ్యూటర్ల సపోర్ట్ తో జీవితా రాజశేఖర్ మరియు ఈ సినిమా నిర్మాత సినిమా ను పంపిణీ చేయగా మిగిలిన ఏరియాలలో సినిమా బిజినెస్ 11.5 కోట్ల మేర అవ్వడం తో ఆ లక్క ప్రకారం సినిమా 12 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యేది.

కానీ 3 వారాలు ముగిసే సమయానికి సినిమా కేవలం 7.9 కోట్ల షేర్ ని 17 కోట్ల గ్రాస్ ని మాత్రమే అందుకుని ఇప్పుడు 8.5 కోట్ల లోపే బాక్స్ ఆఫీస్ పరుగును ఆపనుంది. దాంతో మంచి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ రిజల్ట్ ని సొంతం చేసుకోనుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమాలేవీ హిట్ కాలేదు. ఈ సినిమా అయినా అవుతుంది అనుకున్నా ఈ సినిమా కూడా ఫ్లాఫ్ జాబితా లో ఎంటర్ అవ్వడం కొంత నిరాశకరమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here