గరుడ వేగకి ఊపిరి పోసిన 4 కోట్లు…అసలు మ్యాటర్ ఏంటి అంటే??

0
1243

  టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ PSV గరుడ వేగ….. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్నా అనుకున్న రేంజ్ వసూళ్ళని రాబట్టడంలో మాత్రం విఫలం అయ్యింది. దాంతో సినిమా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కాలేక మొత్తం మీద ఫ్లాఫ్ గా మిగిలిపోయి నిర్మాతకు మంచి సినిమా తీశాడు అన్న పేరు తెచ్చినా లాభాలు తెచ్చి పెట్టలేక పోయింది.

కానీ ఇలాంటి సమయంలో సినిమా ని నిర్మించిన నిర్మాతలకి ఊపిరి పోస్తూ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా 4.12 కోట్లు పలికి ఆశ్యర్యపరిచాయి అని చెప్పొచ్చు. టాలీవుడ్ లీడింగ్ చానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని పోటి లో 4.12 కోట్లు పెట్టి కొనడడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

కాగా సినిమాకి ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్….ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ అంటూ మరికొంత డబ్బు దక్కే అవకాశం ఉండటంతో నిర్మాత తిరిగి ఊపిరి పీల్చుకునే చాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజశేఖర్ కూడా హీరోగా మరికొంత కాలం కంటిన్యు అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here