“గరుడ వేగ” సీక్వెల్… డైరెక్టర్ ఎవరంటే?

0
1742

యాంగ్రీ యంగ్ మాన్ గా టాలీవుడ్ ను ఒకప్పుడు ఏలిన రాజశేఖర్ తర్వాత కాలం లో విజయాలు లేక మార్కెట్ ని ఆల్ మోస్ట్ క్లోజ్ చేసుకున్నాడు, అదే సమయం లో టాలీవుడ్ లో స్పై థ్రిల్లర్ ల కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నా హిట్ టాక్ ని మాత్రం అందుకోలేక పోతున్న సమయం లో స్పైడర్ లాంటి సినిమాలు నిరాశ పరిచిన సమయం లో అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల….

మనసు ను గెలుచుకున్న గరుడ వేగ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది, కమర్షియల్ గా అన్ సీజన్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినా మాత్రం సినిమా పరంగా కానీ టేకింగ్ పరంగా కానీ గరుడ వేగ సినిమా కి టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ నుండి కూడా…

మంచి గుర్తుంపు లభించింది, ఈ సినిమా తోనే మళ్ళీ లైం లైట్ లోకి వచ్చి వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ దూసుకు పోతున్నాడు రాజశేఖర్. కాగా ఇప్పుడు ఆ సినిమా కి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశాడట రాజ శేఖర్.

డైరెక్టర్ ఎవరనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ లో పెట్టినా దర్శకుడిగా మళ్ళీ ప్రవీణ్ సత్తారు నే తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. 20 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో ఆల్ మోస్ట్ ఓ భారీ స్టార్ హీరో మూవీ రేంజ్ అవుట్ పుట్ ని ఇచ్చాడు ప్రవీణ్ సత్తారు.

దాంతో ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో మొదలు కాబోతున్న ఈ సినిమా సీక్వెల్ ని కూడా ప్రవీణ్ సత్తారు చేతిలోనే పెట్టబోతున్నాడట రాజ శేఖర్. ప్రస్తుతం స్టొరీ ఫైనల్ స్టేజ్ లో ఉందని చెబుతున్నారు. తొలి సినిమా కమర్షియల్ గా అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమా అందుకోవాలని కోరుకుందాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here