గరుడవేగ టోటల్ కలెక్షన్స్…టాలీవుడ్ మొత్తం షాక్!!

0
7682

    సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ గరుడవేగ….ఏమాత్రం అంచనాలు లేని ఈ సినిమా కి ఏకంగా 24 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించారు అంటే…సినిమా ఏముంది అంటూ కొద్దిగా ఆసక్తి ఏర్పడగా సినిమా టీసర్ ట్రైలర్ రిలీజ్ అయ్యిన రెస్పాన్స్ అద్బుతంగా ఉన్నా రాజశేఖర్ సినిమాల పై తగ్గిన ఆసక్తి వలన ఈ సినిమాకి పెద్దగా థియేటర్స్ దక్కకపోవడం తో చాలా ఏరియాలలో ఓన్ గానే సినిమాను నిర్మాతలు రిలీజ్ చేశారు.

మొదటి ఆటకే యునానిమస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బడ్జెట్ ని ఓన్ రిలీజ్ ని పక్కకు పెట్టి మిగిలిన థియేట్రికల్ వాల్యూ సుమారు 12.5 కోట్లు అవ్వడంతో 13.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ పరుగు మొదలు పెట్టిన ఈ సినిమా రీసెంట్ గా పరుగుని ఆపేసింది.

మొత్తం మీద సినిమా కలెక్షన్స్ 8.1 కోట్లను మాత్రమే అందుకుని ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా ఇలాంటి స్పై థ్రిల్లర్ మూవీస్ తెలుగు లో ఆడినవి లేకపోవడంతో ఈ సినిమా టాక్ బాగుండటంతో కచ్చితంగా సేఫ్ అవుతుంది అంతా అనుకున్నారు.

కానీ పోటి లో అదీ కేవలం 220 లోపు థియేటర్స్ లో మాత్రమె రిలీజ్ అవ్వడం థియేటర్స్ పెరిగే చాన్స్ లేకపోవడంతో సినిమా ఉన్న తక్కువ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా అవి సినిమాను సేఫ్ చేయలేకపోయాయనే చెప్పాలి.

హాలీవుడ్ రేంజ్ మూవీ అంటూ మెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు టోటల్ కలెక్షన్స్ ని చూసి ఇలాంటి కాన్సెప్ట్ లు మనకు నచ్చే చాన్స్ చాలా తక్కువ అని…నచ్చినా అన్ని వర్గాలు చూడటం కష్టమని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా ఫలితం తెలిసిపోయినా చాలా కాలంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ సినిమా మళ్ళీ లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here