గూఢచారి టోటల్ కలెక్షన్స్…డబుల్ బ్లాక్ బస్టర్

0
1454

అడవి శేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గూఢచారి బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది…సినిమా మొదటి ఆటకే అద్బుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర స్పై త్రిల్లర్ మూవీస్ లో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.

సినిమాను మొత్తం మీద 5 కోట్లకు అమ్మగా టోటల్ రన్ లో సినిమా నైజాంలో 3.35 కోట్లు, సీడెడ్ లో 67 లక్షలు టోటల్ ఆంధ్రాలో 2.9 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. టోటల్ గా రెండు రాష్ట్రాల్లో సినిమా 6.92 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.05 కోట్లు అమెరికాలో 2.2 కోట్లు వసూల్ చేయగా టోటల్ గా రెండు రాష్ట్రాల ఆవల సినిమా 3.27 కోట్ల షేర్ ని వసూల్ చేసింది…టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 10.19 కోట్ల షేర్ తో బిజినెస్ కి డబుల్ వసూల్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here