ఫ్లాఫ్స్ పడ్డా క్రేజ్ తగ్గలేదు..ఒక్క హిట్ పడితే…కుమ్ముడే!

0
1661

మాస్ లో మంచి క్రేజ్ ఉన్న తెలుగు హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. కెరీర్ మొదటి నుండి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న గోపించాండ్ సరైన సమయంలో హిట్ పడటం లేదు. లౌక్యం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టలేదు.

రీసెంట్ గా పంతంతో కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా చేసి కంబ్యాక్ చేయాలి అనుకున్నా ఆ సినిమా కూడా అంచనాలను పూర్తిగా అందుకోలేదు. టోటల్ రన్ లో 10.5 కోట్ల రేంజ్ షేర్ ని మాత్రమే సాధించింది. కానీ వరుస ఫ్లాఫ్స్ లో కూడా మినిమమ్ 2.5 నుండి 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సాధిస్తున్నాడు గోపీచంద్.

వీకెండ్ వసూళ్లు 8 కోట్ల రేంజ్ లో ఉంటున్నాయి. అంటే మీడియం రేంజ్ హీరోలలో మంచి ఓపెనింగ్స్ కిందే చెప్పాలి. కానీ సరైన సినిమా పడితే గోపీచంద్ రేంజ్ కి మంచి కలెక్షన్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఇక మీదట చేసే సినిమాలతో అయినా తన మార్కెట్ ని మరింత పెంచుకుంటాడో లేదో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here