గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ-రేటింగ్…హిట్ కొట్టాడా లేదా??

0
5180

  లౌక్యం లాంటి సూపర్ డూపర్ హిట్ తో కెరీర్ తిరిగి గాడిలో పడింది అనుకున్న సమయంలో వరుసగా జిల్, సౌఖ్యం మరియు గౌతమ్ నంద లాంటి వరుస ఫ్లాఫ్స్ తో తిరిగి వెనక పడ్డ హీరో గోపీచంద్ ఇప్పుడు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఆక్సీజన్ సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఈ సినిమాతో తిరిగి ఆక్సీజన్ పీల్చుకుని హిట్ కొట్టి గాడిలో పడాలి అని భావిస్తున్నాడు. మరి ఎం జరుగిందో తెలుసుకుందామా…

తను ఎదగడానికి జనాలు కష్టపడ్డా పర్వాలేదు అనుకునే విలన్….విలన్ వల్ల సర్వస్వం కోల్పోయే స్టేజ్ నుండి పగ తీర్చుకోవాలని భావించే హీరో…ఇది సింపుల్ గా ఆక్సీజన్ స్టొరీ లైన్… ఇలాంటి రివేంజ్ సినిమాలు తెలుగు లో అనేకమ్ రావడం జరిగింది.

మరి వాటికి ఇక్కడ ఆక్సీజన్ సినిమాకి తేడా ఏంటి అనేది టైటిల్ లోనే ఉంది… మంచి పాయింట్ ని ఎంచుకుని కొంతవరకు విజయం సాధించాడు దర్శకుడు… కానీ సినిమా లో మంచి కన్నా చెడు అక్కడక్కడ డామినేషన్ ఎక్కువ చేయడం తో సినిమా మొత్తంగా అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదు అనిపిస్తుంది.

గోపీచంద్ ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేసి తన భుజాన సినిమాను నడిపే ప్రయత్నం చేశాడు. హీరోయిన్స్ రాశిఖన్నా మరియు అను ఏమన్యుయేల్ తమవంతు సాయం కూడా చేశారు. జగపతిబాబు కూడా పర్వాలేదు అనిపించాడు.

ఎటొచ్చి ఓవరాల్ గా సినిమా స్టొరీ లైన్ రివేంజ్ బ్యాగ్ డ్రాప్ తో ఉండటం ఇలాంటి సినిమాలు ఎన్నో చూసేశాం కాబట్టి ఎంతవరకు ఈ సినిమా ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి నచ్చుతుంది అనేది సమస్య.. ఎంటర్ టైన్ మెంట్ కూడా అనుకున్న రేంజ్ లో పండలేకపోయింది.

ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్ బాగున్నా దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు జ్యోతికృష్ణ విజయం సాధించలేకపోయాడు. అలా అని పూర్తిగా కొట్టి పారేసే సినిమా కూడా కాదు. ఏమాత్రం అంచనాలు లేకుండా సినిమాకి వెళితే పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అంటూ బయటికి వచ్చి చెప్పేవాళ్ళు ఎక్కువమంది ఉన్నారు.

సినిమాకి హైలెట్స్ గా ఇంటర్వెల్ ఎపిసోడ్ అలాగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. సినిమా లెంత్ ఎక్కువ అవ్వడం కథ దారి తప్పడం, ఎంటర్ టైన్ మెంట్ పండకపోవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా సినిమా కి మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5 స్టార్స్…మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here