20 కోట్ల బడ్జెట్ 13.5 కోట్ల బిజినెస్…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2638

  లౌక్యం తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన హీరో గోపీచంద్ తర్వాత చేసిన జిల్, సౌఖ్యం లాంటి డిసాస్టర్స్ తర్వాత గౌతమ్ నంద లాంటి మంచి సినిమా చేసినా సరిగ్గా ప్రమోట్ చేసుకోలేక ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన గోపీచంద్ ఆక్సీజన్ కూడా మంచి మెసేజ్ తో రీజనబుల్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.

సినిమా మొత్తం మీద సుమారు 20 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కినట్లు లేటెస్ట్ న్యూస్. చాలా ఏరియాల్లో సినిమాను ఓన్ గా రిలీజ్ చేసుకోగా సినిమా మిగిలిన ఏరియాల థియేట్రికల్ వాల్యూ సుమారు 13 నుండి 13.5 కోట్ల రేంజ్ లో ఉందని అంటున్నారు.

సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా ఏ దశలోనూ కోలుకోలేకపోయిన సినిమా టోటల్ రన్ లో కేవలం 5.7 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుని భారీ గ్లాఫ్ గా మిగిలిపోయింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4.8 కోట్ల షేర్ నే కలెక్ట్ చేసింది ఈ సినిమా..మరి గోపీచంద్ క్లీన్ హిట్ కల ఎప్పుడు నిజామవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here