హలో@డే4….ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అఖిల్

0
1189

  అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ హలో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు నుండి అనుకున్న లెవల్ లో రావడం లేదు… కానీ సూపర్ హిట్ టాక్ పవర్ తో రెండో రోజు మూడు రోజు కొద్ది కొద్దిగా గ్రోత్ చూయించిన హలో 4 వ రోజు క్రిస్టమస్ హాలిడే ఉండటం తో మరింత జోరు చూపించింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు తర్వాత ది బెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ రోజే సొంతం చేసుకుంది…మొత్తం మీద 3 రోజుల్లో 10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని అందుకుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు…అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.7 కోట్ల షేర్ ని అందుకుందట.

ఇక 4 వ రోజు సినిమా పెర్ఫార్మెన్స్ ని బట్టి చూస్తె 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని 4 వ రోజు సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. మొత్తం మీద బిజినెస్ ని అందుకోవాలి అంటే మాత్రం సినిమా మరింత జోరు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here