మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు దక్కిన నంది అవార్డులు ఎన్నో తెలుసా??

0
909

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో అనేక రికార్డులు ఉన్నాయి…. మహేష్ కెరీర్ లో హిట్స్ ఫ్లాఫ్స్ ఉన్నా వాటిలో ఫ్లాఫ్ సినిమా లకు కూడా అవార్డులు అందుకున్న హీరో గా మహేష్ కి రేర్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు. మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన 23 సినిమా లలో 8 సార్లు నంది అవార్డు అందు కున్న హీరో గా మహేష్ కెరీర్ లో రేర్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు.

కెరీర్ లో మొదటి సినిమా రాజకుమారుడు సినిమా కు మొదటి నంది అవార్డ్ అందుకున్న మహేష్ తర్వాత మురారి, టక్కరి దొంగ, ఒక్కడు, నిజం, అతడు, దూకుడు సినిమాలకు అవార్డ్ అందుకున్న మహేష్ ఇక ఇప్పుడు శ్రీమంతుడు సినిమాకు గాను మరోసారి నంది అవార్డ్ అందుకున్నాడు.

అతి తక్కువ సినిమా లలో 8 సార్లు నంది అవార్డ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో గా మహేష్ బాబు సూపర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. నంది అవార్డులే కాక ఫిల్మ్ ఫేర్, ఐఫా, సైమా లాంటి ఇతర అవార్డులలో కూడా జోరు చూపి మహేష్ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్న హీరోగా నిలిచాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here