ఇంటెలిజెంట్ డే 4 అప్ డేట్…ఏంటి సామి ఈ పరిస్థితి!

0
884

  బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంటెలిజెంట్ మూవీ పరిస్థితి చూస్తె ఎవరైనా చెప్పే మాట ఇదే… ఖైదీనంబర్ 150 లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో సినిమా అంటే ఎలాంటి బిజినెస్ కావాలో సాయి ధరం తేజ్ కెరీర్ లో రికార్డ్ లెవల్ లోనే బిజినెస్ ని చేసింది ఇంటెలిజెంట్ మూవీ. కానీ సినిమా లో కంటెంట్ లేక టీసర్ నుండే ఏమాత్రం ప్రభావం చూపలేక పోయిన ఈ సినిమా ఎ దశలోనూ తేరుకోలేదు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా మొదటి రోజే చాపచుట్టేసిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో 3.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక 4 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో సినిమా పరిస్థితి మరింత షాక్ గా మారింది.

ఈ రోజు సినిమా అన్ని చోట్లా భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకోగా ఈ రోజు షేర్ 20 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు…ఈ లెక్కతో సినిమా కనీసం 22 కోట్ల నష్టాలు మిగిలించడం ఖాయమని తేలిపోయింది అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here